బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన చిరు..

తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి. ప్రకృతిని ఆరాధిస్తూ తీరొక్క పూలతో ఈ పండుగను ఎంతో సంబురంగా జరుపుకుంటారు ఇక్కడి మహిళలు. తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు నేడు (శనివారం) సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ట్వీట్‌ చేసిన చిరు.. ‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరపుకుంటున్న నా పడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైంది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ తెలుగులో ట్వీట్ చేశారు చిరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here