ఫ్రెండ్ చెల్లెలితో లవ్ ఎఫైర్.. స్నేహితుడికి తెలిసిపోవడంతో.. కృష్ణా జిల్లాలో దారుణం

ఫ్రెండ్ చెల్లెలితో ప్రేయాయణం సాగించిన యువకుడు.. విషయం తెలిసిపోవడంతో స్నేహితుడిని అడ్డు తొలగించుకునేందుకు దారుణానికి ఒడిగట్టాడు. ఫ్రెండ్‌కి విషమిచ్చి చంపేశాడు. ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. మచిలీపట్నానికి చెందిన యువకుడు తన ఫ్రెండ్ చెల్లెలిని ప్రేమించాడు. తనపై నమ్మకం ఉంచిన ఫ్రెండ్‌ని మోసం చేసి చెల్లెలితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు.

చివరికి ఆ విషయం స్నేహితుడికి తెలిసిపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. తన చెల్లెలి వెంట పడొద్దని.. పద్ధతి మార్చుకోవాలని స్నేహితుడు పలుమార్లు హెచ్చరించాడు. తరచూ ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నాయి. దీంతో తన ప్రేమకు అడ్డు పడుతున్న స్నేహితుడిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రియురాలి సోదరుడికి విషమిచ్చి చంపేశాడు. విషం తాగిన స్నేహితుడు కొనఊపిరితో కొట్టుకుంటుండగా గమనించిన స్థానికులు అతనిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here