ప్రేమోన్మాదానికి ఇంటర్ విద్యార్థిని బలి.. నాగర్‌కర్నూలులో దారుణం

ప్రేమోన్మాదం ఓ యువతి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తెలంగాణలోని జిల్లాలో ఇంటర్ విద్యార్థిని దారుణహత్యకు గురైంది. పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(18) ఇంటర్ చదువుతోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని అతడు చాలారోజులు యువతి వెంటపడుతున్నా ఆమె పట్టించుకోవడం లేదు. అయితే సోమవారం ఆ యువతి పెబ్బేరు ప్రభుత్వాసుపత్రి వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది.

Also Read:

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యుల విచారణలో సాయికృష్ణ ప్రేమ వేధింపులు బయటపడటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. యువతిని అతడే హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here