పోలీస్ ప్రేమ విషాదాంతం.. ప్రియుడు రాలేదని మహిళా కానిస్టేబుల్..

పోలీసు ప్రేమ విషాదాంతమైంది. ప్రియుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు ప్రియురాలు ఏర్పాట్లు చేసింది. అతనికి ఫోన్ చేసి ఆహ్వానించింది. అయితే అనుకోని విధంగా అతనికి వేరే డ్యూటీ పడడంతో రాలేకపోయాడు. అది చెబుతామని కాస్త లేటుగా ఫోన్ చేశాడు. అయితే అప్పటికే ఆమె జీవితం ముగిసిపోయింది. ప్రియుడు రాలేదన్న మనస్థాపంతో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

జిల్లాకు చెందిన శరణ్య(22) రైల్వే కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఆమెకు ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఏలుమలై అనే యువకుడితో పరిచయమైంది. ఇద్దరూ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏలుమలై పుట్టినరోజు రావడంతో సెలెబ్రేట్ చేయాలని ప్రియురాలు శరణ్య భావించి ఏర్పాట్లు చేసింది. సాయంత్రం ఆరు గంటల్లోపు పెరంబూరులోని తన క్వార్టర్‌కి రావాలని ప్రియుడిని ఆహ్వానించింది.

Also Read:

తన విధులు త్వరగా ముగించుకుని క్వార్టర్స్‌కి వెళ్లిన శరణ్య.. ప్రియుడు ఏలుమలై కోసం ఎదురుచూసింది. అయితే అతనికి కారోనా భద్రత చర్యల్లో భాగంగా వేరేచోట డ్యూటీ వేయడంతో వెళ్లలేకపోయాడు. అదే విషయం చెబుదామని రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రియురాలికి ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ఎంతసేపటికీ ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చి పక్క క్వార్టర్స్‌లో ఉండే ఆమె స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

ఆమె క్వార్టర్స్‌కి వెళ్లి చూడగా శరణ్య ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. ప్రియుడు రాలేదన్న మనస్థాపంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here