పీకల్దాకా తాగి పైత్యం.. నడిరోడ్డుపై బైక్‌ తగలబెట్టి హల్‌చల్

లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబుల చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న బైక్‌కి అడ్డువచ్చిందన్న కోపంతో మందుబాబు.. విషసర్పాన్ని కసకస కొరికి చంపేశాడు. పళ్లతో పాము శరీరాన్ని పీకేశాడు. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఆ దారుణ ఘటన మరువక ముందే మరో మందుబాబు నడిరోడ్డుపై బైక్ తగలబెట్టి కలకలం సృష్టించాడు. ఈ ఘటన కూడా కర్ణాటకలోనే జరగడం విశేషం.

నలభై రోజుల తర్వాత మద్యం షాపులు తెరవడంతో ఫుల్లుగా మందుతాగిన యువకుడు బైక్‌ని తగలబెట్టిన సంఘటన నగరంలో జరిగింది. సూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేకల్ వద్ద నడిరోడ్డుపై బైక్ పడేసి నిప్పంటించాడు. అందరూ చూస్తుండగానే మందుబాబు నిప్పు పెట్టి మంటలను వేడుకగా చూస్తూ నిల్చున్నాడు.

Also Read:

అటుగా వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యపోయి చూస్తున్నా.. ఏమీ పట్టనట్టుగా యువకుడు అక్కడే నిలబడిపోయాడు. బైక్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here