పవన్ వచ్చాడు.. ప్రభాస్ వస్తున్నాడు.. మహేష్ వస్తాడు

టాలీవుడ్ లో ఈ సీక్వెన్సే కొత్త ఆసక్తికి తెర తీస్తోంది. టాలీవుడ్ లో టాప్ 3 హీరోలుగా ఉన్న ఈ ముగ్గురిలో.. ఈ ఏడాది ముందుగా కాటమరాయుడు సినిమాతో పవన్ ఖాతా తెరిచాడు. డివైడ్ టాక్ వచ్చినా సరే.. మాంఛి వసూళ్లతో కాటమరాయుడు దూసుకుపోతున్నాడు.

ఇప్పుడు బాహుబలి ద కన్ క్లూజన్ సినిమాతో.. ప్రభాస్ కూడా రంగంలోకి దూకేస్తున్నాడు. భారీ హంగామాతో.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుని.. అభిమానులను మరింత ఎగ్జయిట్ మెంట్ కు గురి చేస్తున్నాడు. సినిమా ట్రయిలరే ఇంత భారీగా ఉంటే.. అసలు బొమ్మ ఇంకెలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు.

ఇక మిగిలింది మహేష్ బాబు వంతు. మురుగదాస్ కాంబినేషన్ లో మహేష్ కొత్త సినిమా చేస్తున్నాడు. వేగంగా షూటింగ్ కూడా ఫినిష్ చేసేస్తున్నాడు. బాహుబలి మేనియా కాస్త తగ్గే టైమ్ లో.. తన సినిమాను థియేటర్లలో వదిలేందుకు మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. తమ అభిమాన హీరో కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా.. తెగ వెయిట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here