నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా.. నీతి భవన్ మూసివేత

నీ తి ఆయోగ్ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఢిల్లీలోని భవనాన్ని మూసేశారు. తగిన జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే పార్లమెంట్, రాష్ట్రపతి భవన్‌లో కలకలం రేపిన కరోనా వైరస్.. తాజాగా నీతి ఆయోగ్‌లో అలజడి సృష్టించడం గమనార్హం. నీతి ఆయోగ్ భవనంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సంస్థ అధికారిక ట్విటర్ ద్వారా మంగళవారం (ఏప్రిల్ 28) వెల్లడించారు. ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు.

కరోనా పాజిటివ్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తులందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. నీతి భవన్‌లో ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన జాగ్రత్తలన్నీ పాటిస్తున్నామని తెలిపారు. భవనాన్ని మూసేసి జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పారిశుధ్య పనులు చేపట్టామని, వైరస్ నియంత్రణ రసాయనాలను చల్లుతున్నామని తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here