నితిన్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నాడా?

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ నెల 26న నితిన్ వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. హైద‌రాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో లిమిటెడ్ మెంబ‌ర్స్ పాల్గొన‌గా నితిన్, షాలినిల వివాహం జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మార్పులు వ‌చ్చాక ఇండ‌స్ట్రీ వారికి నితిన్ స్పెష‌ల్ పార్టీని ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. కాగా, ఆగ‌స్టు 8న మరో స్టార్ హీరో రానా కూడా వివాహం చేసుకోనున్న విష‌యం తెలిసిందే.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పనున్నాడు. ఈ నెల 26వ తేదీన షాలినిని హైదరాబాద్‌ లోని ఫామ్‌ హౌస్‌ లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నాడు. అయితే ఫిబ్రవరి లోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దుబాయ్ లో ఏప్రిల్ నెలలో పెళ్లి అనుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా ఆ క‌ల‌ల‌న్నీ క‌రిగిపోయాయి. దీంతో సాదా సీదాగానే వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న నితిన్ ఈ నెల‌లోనే వివాహానికి సిద్ధ‌మైన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here