దేశమంతా కరోనా ఆస్పత్రులపై పూల వర్షం.. విమానాలు, హెలికాప్టర్లతో

మహమ్మారి క‌రోనా వైర‌స్‌పై జరుగుతున్న పోరాటంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వైద్యులకు భారతీయ సైన్యం ఘనంగా సంఘీభావం ప్రకటించనుంది. ఈ మేరకు మే 3న ఆదివారం దేశ‌వ్యాప్తంగా ఫ్లైపాస్ట్ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా భారత ఆర్మీ పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) కల్నల్ అమ‌న్ ఆనంద్ వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భార‌త వైమానిక ద‌ళానికి (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) చెందిన ఫైట‌ర్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ఈ విన్యాసాలు చేయనున్నట్లుగా ఆయ‌న వివరించారు. ఉత్తరాది క‌శ్మీర్ నుంచి దక్షిణాది త్రివేండ్రం వ‌ర‌కు, తూర్పున డిబ్రూఘ‌ర్ నుంచి పశ్చిమాన క‌చ్ వ‌ర‌కు ఈ విన్యాసాలు జరుగుతాయని ఆయన వివరించారు.

ఇందులో భాగంగా కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న అన్ని హాస్పిటళ్లపై ఈ విమానాలు పూల వ‌ర్షం కురిపిస్తాయ‌ని చెప్పారు. కొన్ని చోట్ల భారత నౌకాదళ (నేవీ) హెలీకాప్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని కల్నల్ అమన్ ఆనంద్ వివరించారు. అంతేకాక, ఆదివారం సాయంత్రం వేళల్లో తీర ప్రాంతాలైన ముంబయి, పోరుబందర్, కార్వార్, విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పోర్ట్ బ్లెయిర్ పోర్టుల్లో లైట్ హౌజ్‌లను వెలిగిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని శుక్రవారం నాటి మీడియా స‌మావేశంలోనూ త్రివిధ దళాధిపతి బిపిన్ రావ‌త్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:

కరోనాపై పోరాడుతున్న వైద్యులకు సంఘీభావంలో భాగంగా ఉదయం 9.30 గంటలకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిపై పూల వర్షం కురిపించనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here