దారుణం… పిల్లలతో సహా ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

లాక్ డౌన్ వేళ ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. శనివారం ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇతాహ్‌లో చోటు చేసుకుంది. కోత్వాలీ పోలీస్ స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ విషాదకరమైన ఘటన జరిగింది. గ్రాండ్‌ ట్రంక్ రోడ్డు.. శ్రీనగర్ కాలనీలోని వైద్యశాఖలో పనిచేస్తున్న రాజేశ్వర్ పచౌరీ అనే కుటుంబం నివసిస్తోంది. రాజేశ్వర్‌తో పాటు అతని కుటుంబసభ్యులు దివ్య, బుల్ బుల్, దివ్య కుమారులు ఆరుష్, లాలూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

ఇంట్లో పడిఉన్న మృతదేహాల పక్కన టాయిలట్ క్లీనర్‌తో పాటు.. విషం కూడా లభించిందని.. పోలీసులు తెలిపారు. అయితే ఇంట్లో ఎవరు బలవంతంగా ప్రవేశించలేదని పోలీసులు స్పష్టం చేశారు. గ్యాస్ కట్టర్ సాయంతో ఇంటిగేటును తెరిచి లోపలికి వెళ్లినట్లుగా తెలిపారు. అయితే దివ్య చేతులపైన, బుల్ బుల్ మెడపైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరి నోటి ద్వారా నురుగు, రక్తం బటయకు రావడాన్ని కూడా గుర్తించామన్నారు పోలీసులు.

డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించామని తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి బంధువులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. స్థానికులు చెప్పినదాని ప్రకారం పాలవాడు ముందుగా వీరిని గుర్తించినట్లు తెలుస్తోంది. పొద్దున్నే వచ్చిన పాలవాడు ఎంత తలుపు కొట్టిన తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి అతడు వెంటనే అక్కడున్న ఓ అడ్వకేట్‌కు సమాచారం అందించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే అసలు ఏం జరిగిందన్న విషయం మాత్రం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుందంటున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here