త్రివిధ దళాల అధిపతి ప్రెస్ మీట్.. ఏం చెప్తారు? సర్వత్రా ఆసక్తి

భా రత సైనిక దళాల మహా దళపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ మీడియాతో మాట్లాడనున్నారు. ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో కలిసి శుక్రవారం (మే 1) సాయంత్రం 6 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన పొడిగించనున్నారనే వార్తల నేపథ్యంలో బిపిన్ రావత్ ఏం మాట్లాడనున్నారనేది ఆసక్తికర చర్చకు తావిస్తోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రివిధ దళపతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

భారత్ కోవిడ్-19తో పోరు సాగిస్తున్న వేళ తమ వంతు సాయం అందిస్తామని గత వారం మీడియాతో మాట్లాడుతూ బిపిన్ రావత్ వెల్లడించారు. ప్రభుత్వానికి, ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సహనంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే ఇండియన్ ఆర్మీపై కరోనా వైరస్ పరిమిత స్థాయిలో ప్రభావం చూపగలిగిందని ఆయన ఓ ప్రశ్నకు బదులిస్తూ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం భారత త్రివిధ దళాలను ఏకతాటిపైకి తీసుకొస్తూ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి మొట్టమొదటి అధిపతిగా మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్‌ను నియమించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here