జేసీ కుటుంబానికి పార్టీ భరోసా.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రి చేరుకున్నారు. లోకేష్ జేసీ కుటుంబసభ్యుల్ని పరామర్శించి.. వారికి సంఘీభావం తెలియజేశారు. అలాగే అరెస్ట్, తదితర అంశాలపై వారితో చర్చించారు. జేసీ కుటుంబానికి పార్టీ ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.

తప్పుడు కేసులు పెడుతున్నారని, కావాలని అరెస్టులు చేస్తున్నారని జగన్ ప్రబుత్వాన్ని దుయ్యబట్టారు. అన్నీ రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. తొందరలోనే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు….

వాస్తవానికి లోకేష్ కడప జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పరామర్శించాలని భావించారు. కానీ జైలు అధికారులు అనుమతి నిరాకరించడంతో తాడిపత్రికి వెళుతున్నారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను శనివారం హైదరాబాద్‌లో అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అనంతపురం తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే వీరిని అనంతపురంలోనే జైలుకు తరలించాలని భావించారు.. కానీ అక్కడ కరోనా భయంతో సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో కడప జైలుకు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here