క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసుల దుర్మరణం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమీపంలో జరిగిన ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వాసులు మృత్యువాత‌ప‌డ్డారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గద్వాల జిల్లా కేటీ దొడ్డికి చెందిన గోపాల్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా స్వగ్రామానికి వెళ్లేందుకు మరో ముగ్గురు మహిళలతో కలసి బెంగళూరు నుంచి గురువారం ఉదయం కారులో బయలుదేరారు.

రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలో వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపాల్ అక్కడికక్కడే చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళలు గోపాల్ కుటుంబ సభ్యులా? లేక తోటి ఉద్యోగులా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Also Read:

కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108కి ఫోన్ చేసి స‌మాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది గాయపడిన మహిళలను రాయచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల‌కు స‌మాచారం అంద‌జేశారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here