కిమ్ కోసం నార్త్ కోరియాకు చైనా డాక్టర్లు

అధ్యక్షుడు కిమ్ జోంగ్ అనారోగ్యంపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు గత కొన్నిరోజులుగా అన్ని దేశాలు చర్చించుకుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో డ్రాగన్ కంట్రీ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి ఓ వైద్య బందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన లైనిస్‌ డిపార్టమెంట్‌ నేతృత్వంలో ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆ దేశానికి పంపినట్ల ఓ ప్రముఖ పత్రిక పేర్కొంది. అయితే కిమ్‌ ఆరోగ్యంపై మాత్రం చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆ దేశంకానీ.. అక్కడి మీడియా కాని ఎలాంటి ప్రకటక చేయలేదు. తాజాగా అధినేత ఆరోగ్యంపై దక్షిణ కొరియా స్పందించింది. కిమ్‌కు ఎలాంటి సమస్య లేకపోవచ్చిని ఆయనపై వస్తున్న వదంతులను కొట్టిపారేసింది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు సైతం కిమ్ అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కిమ్ బాగానే ఉన్నారని ఆశిస్తున్నానన్నారు ట్రంప్. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారమైతే ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా విషమించినట్టేనన్నారు. దీంతో కిమ్ హెల్త్ విషయంలో ఏదో జరుగుతుందన్న మాట మాత్రం స్పష్టమవుతోంది

ప్రపంచ వ్యాప్తంగా కిమ్ అనారోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్న సమయంలో చైనా వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా లాంటి విపత్తులో కూడా చైనా దేశం ఉత్తర కొరియాకు వైద్యులను పంపడంతో నిజంగానే కిమ్‌ ఆరోగ్యం క్షిణించి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం ఏమీ లేనప్పుడు, అంతా బాగానే ఉన్నప్పుడు… ఉత్తర కొరియా ఎందుకు స్పందించటట్లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.

మరోవైపు ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాలేదు.ఈ నెల 15న జరిగిన దేశ వ్యవస్థాపకుడు, కిమ్ తాతయ్య కిమ్ 2 సుంగ్ జయంతి కార్యక్రమాల్లో కిమ్ జాంగ్ ఉన్ కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. తాత జయంతి ఉత్సవాల్లో ఎప్పుడూ పాల్గొనే కిమ్ కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే కిమ్‌ కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అనారోగ్యంతో ఆయనకు శస్త్రచికిత్స కూడా నిర్వహించినట్లు సమాచారం. అప్పటినుంచి కిమ్‌ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here