కమిషనర్ ఆఫీస్‌కి ఫోన్ చేసి కిరాణా లిస్టు చెప్పిన లేడీ ఐపీఎస్.. ఆరా తీస్తే షాకింగ్

మోసాల్లో మేమేమీ తీసిపోలేదంటున్నారు కొందరు మహిళలు. ఐపీఎస్ అధికారినంటూ ఓ కిలాడీ లేడీ హల్‌చల్ చేసింది. కమిషనర్ కార్యాలయానికే ఫోన్ చేసి నిత్యవసర సరుకులు పంపించాలని ఆర్డర్ వేసింది. అలాగే ఇద్దరు హోంగార్డులను కూడా పంపాలని ఆదేశాలిచ్చేసింది. కంగుతిన్న కమిషనరేట్ వర్గాలు ఇంతకీ ఆమె ఎవరని ఆరా తీయడంతో నకిలీ బాగోతం బయటపడింది. ఐపీఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసి కటకటాల వెనక్కినెట్టిన సంఘటన ఒడిశాలో వెలుగుచూసింది.

ఫారెస్ట్ పార్కు ప్రాంతానికి చెందిన అధికారిణి శర్మిష్ట బెహరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు తాను ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకున్న బెహరా ఏకంగా కమిషనరేట్ కార్యాలయానికి ఫోన్ చేసి నిత్యవసర సరుకులు పంపాలని కోరింది. అలాగే ఇద్దరు హోంగార్డులను కూడా పంపించమనడంతో కమిషనరేట్ వర్గాలకు అనుమానం వచ్చింది.

Also Read:

ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టడంతో నకిలీ ఐపీఎస్ వ్యవహారం బట్టబయలైంది. ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు బెహరాను అరెస్టు చేశారు. కమిషనరేట్‌కి ఫోన్ చేసి నకిలీ ఐపీఎస్ అని చెప్పి సరుకులు పంపమని అడగడంతో అనుమానం వచ్చినట్లుగా తెలుస్తోంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here