ఏపీ ముఖ్యమంత్రికి ఆఫీసులో ఎంపీ కృష్ణం రాజు కోవర్టులు ఉన్నారా..?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆఫీసులో, వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కోవర్టులు ఉన్నారా అంటే.. ఏమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు! అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది.. ఎలా వచ్చింది.. దానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం…

ఏపీ ముఖ్యమంత్రికి నరసాపురం వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒకదాని తర్వాత ఒకటి లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అమరావతి రైతుల కోసం, అమరావతిలోనే రాజధాని కోసం అంటూ ఒకటి, అల్లూరి సీతారామరాజు పేరు కొత్త జిల్లాకు పెట్టాలని మరొకటి లేఖలు రాశారు. అదేముందిలే చాలా మంది రాస్తుంటారు కదా అనుకోవద్దు… విచిత్రంగా ఆర్.ఆర్.ఆర్. లేఖ రాసిన మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరుతోజిల్లా ఏర్పాటుచేస్తామని ప్రకటించింది!

ఇక్కడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయాలు ఇంతకాలం వైకాపాలో రెబల్ గా కాకుండా, అందరిలా ఎంపీగా ఉన్నారు కాబట్టి ముందుగానే తెలిసిన విషయం కాబట్టి, అలా లేఖ రాశారాని కొందరు అంటుంటే… సీఎం ఆఫీసులో రఘురామకృష్ణం రాజుకి కోవార్టులో ఉన్నారేమో అనే అనుమానం మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ లేఖ, అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన కారణమో ఏమో కానీ… మరో లేఖ రాసేశారు రఘు!

వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ “అవ్వాతాతల” పథకానికి జీవో ఇచ్చారు. కానీ 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని జీఓ విడుదల చేశారు కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాత్రమే దానిని అమలు చేస్తున్నారు. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులు సుమారు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోతున్నారు.. అలాగే ప్రతి ఏడాది రూ.250 పెంచుతామని చెప్పిన పెన్షన్ కూడా వైఎస్‌ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని కోరారు.

ఈ విషయంలో కూడా లీకులే కారణం అని అంటున్నారు విశ్లేషకులు! నిజంగా జగన్ కూడా తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున ఈ రూ.250 ప్రకటించాలని భావించారని.. అదే విషయంపై రెండు రోజుల ముందు రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వానికి లేఖ రాశారని అంటున్నారు! అదే నిజమైతే మాత్రం.. రెండో ఏడాదికి సంబందించిన రూ. 250 పెన్షన్ పెరిగినట్లే! అలాకానిపక్షంలో జగన్ మరోసారి ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఏది ఏమైనా… రఘురామకృష్ణం రాజు మాత్రం ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ప్రజల తరుపున పోరాటం చేస్తున్నానని చెబుతూనే.. పరోక్షంగా జగన్ ను ఇబ్బందిపెడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటివి బహిరంగంగా ఎందుకయ్యా.. పార్టీకే చెప్పొచ్చుగా అంటే… జగన్ అపాయింట్ మీంట్ ఇప్పించండి అని అంటున్నారు! ఆవుకథ మళ్లీ మొదలు పెడుతున్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here