ఉద్యోగాలు పోతాయనే భయం.. కోట్లు చెల్లించి చార్టర్ ఫ్లైట్‌లో అమెరికా వెళ్లేందుకు సిద్ధం!

కారణంగా అమెరికాలో పనిచేసే భారతీయుల్లో చాలా మంది స్వదేశంలో చిక్కుకున్నారు. దీంతో అక్కడ వారి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. తమ ఉద్యోగాలను కాపాడుకోవాలంటే వీరి తప్పనిసరిగా అమెరికాకు వెళ్లాలి. కేంద్రం అంతర్జాతీయ విమాన ప్రయాణాలు నిలిపివేయడంతో చార్టర్ ఫ్లైట్‌లో వెళ్లే పరిస్థితి. ప్రత్యేక విమానం కోసం 9 లక్షల డాలర్లు (రూ.6.75 కోట్లు) ఖర్చుచేయాలి. ఈ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకున్న పలువురు ఓ గ్రూప్‌గా ఏర్పడి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటున్నారు.

ప్రత్యేక విమానం కోసం 9 లక్షల డాలర్లు చెల్లించడానికి ఎవరూ ముందుకు రారేమో అనుకున్నాం.. ప్రత్యేక విమానంలో సీట్లు నిండటం కష్టమని భావించాను.. కానీ, దీనిపై సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన ఓ హెచ్-1బీ వీసాదారుడు వ్యాఖ్యానించాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యక్తి తన భార్య, రెండేళ్ల కుమారుడితో కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ఇటీవల వారితో కలిసి భారత్‌కు రాగా.. ఇదే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో ఇక్కడ చిక్కుకున్నారు. తిరిగి అక్కడకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపాడు.

తన లాంటి మరో 100 మంది హెచ్-1బీ వీసాదారులు స్వదేశంలో చిక్కుకున్నారని, తాము నాన్-అమెరికన్స్ కావడంతో అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేయలేదన్నారు. 283 సీట్ల సామర్ధ్యం (బిజినెస్ సీట్లతో సహా) ఉన్న విమానంలో 100 మంది ప్రయాణీకులు 900,000 నుంచి 950,000 డాలర్లు, 278 మంది సీటింగ్ సామర్ధ్యం ఉన్న బోయింగ్ విమానానికి ఒక్కొక్కరికీ 850,000 నుంచి 900,000 డాలర్లు వరకు అవుతుంది. అయినా, ఉద్యోగం పోతుందనే భయంతో ఎంత ఖర్చయినా అమెరికా వెళ్లడానికి వెనుకాడటం లేదన్నాడు.

ఇతర ప్రయాణికులు కూడా ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సంప్రదించిన చాలా మంది ఎంత చెల్లించయినా యుఎస్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్న స్వరణ్ అనే వ్యక్తి తమ ఉద్యోగాలు పోతాయనే భయం వెంటాడుతుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సైతం సంక్షోభం ఎదుర్కొంటోందని, చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.. ఇప్పటి వరకు భారత్ నుంచి పని చేస్తున్నాను, కానీ దేశం వెలుపల నుంచి ఎంతకాలం పని చేయవచ్చనే దానిపై ఆంక్షలు ఉన్నాయని అన్నాడు.

లాక్‌డౌన్ కారణంగా మిడ్-సీనియర్ లెవెల్ ఉద్యోగులు భారత్‌లో చిక్కుకున్నారని, ఒకవేళ వారిని ఉద్యోగాల నుంచి అమెరికా సంస్థలు తొలగిస్తే స్వదేశంలోని వారికి పోటీ భారీగా ఉంటుందని నార్త్ కరోలినాలోని రాలేలో ఉంటున్న వినోద్ (పేరు మార్చారు) తెలిపాడు. చైన్నైలో ఉన్న అతడు.. తాను మార్చి తొలివారంలో స్వదేశానికి రాగా.. ఉద్యోగం కోల్పోయానని అన్నారు. ప్రస్తుతం తన భార్య న్యూజెర్సీలో ఉందని, నా వీసా పునరుద్దరిస్తే కొత్త ఉద్యోగం కోసం వెతుక్కోవాలి.. కళ్ల ముందు నా కలలు కుప్పకూలిపోతున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here