‘ఆర్.ఆర్.ఆర్’ ఇప్పట్లో లేనట్లే…?

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ కొన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి.

ఇప్పుడు ఒకవేళ ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటిస్తున్న స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా షూటింగ్ లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటే ఈ సినిమా పరిస్థితి ఏంటని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు. నిజానికి ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీలను మార్చుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా కారణంగా 100 రోజులు వేస్ట్ అయిపోయాయి.

ఇక ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తే 2021 సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ భావించారు.కానీ ఇప్పుడు చరణ్ – తారక్ లు చిత్రీకరణకి రాకపోతే ఈ సినిమా మరింత లేట్ అవనుంది. ఈ విధంగా చూసుకుంటే వచ్చే ఏడాది “ఆర్.ఆర్.ఆర్” సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని తెలుస్తోంది.

చిన్న పెద్ద సినిమాలు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకధీరుడు రాజమౌళి చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ పై పడింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎలా నిర్వహిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు రోజు రోజుకి కరోనా తీవ్ర రూపం దాల్చుతుండటంతో ఇప్పట్లో చిత్రీకరణకి వెళ్లేలా కనిపించడం లేదు. దీనికి తోడు సీనియర్ హీరోలు వయసు రీత్యా షూటింగ్స్ కి రాలేము అంటున్నారట. ఈ పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది చివరి దాకా షూటింగ్ కి వెళ్లకపోవడమే కరెక్ట్ అని కొంతమంది స్టార్ హీరోలు డిసైడ్ అయ్యారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here