ఆపరేషన్ ఆకర్ష్: చైనా ఏకాకి అవుతున్న వేళ.. ప్రధాని మోదీ కీలక భేటీ

కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ బలహీనమైన వేళ.. భారత్‌లోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, హోంమంత్రి అమిత్ షాతోపాటు వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, ఇతర సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. స్థానిక పెట్టుబడులను ప్రమోట్ చేసే విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.

పెట్టుబడిదారుల సమస్యలను గుర్తించి వారికి సాయం చేయడంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని.. నిర్ణీత గడువులోగా కేంద్రం, రాష్ట్రాల అనుమతులు మంజూరు చేయాలని ప్రధాని మోదీ సూచించారు.

ఇండస్ట్రీయల్ ల్యాండ్స్/ ప్లాట్లు/ ఎస్టేట్ల‌ను ప్రమోట్ చేయడం కోసం… వాటికి మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన ఆర్థిక సాయం చేయడం కోసం ఓ ప్రణాళిక రూపొందించాలని కూడా చర్చించారని ప్రభుత్వం తెలిపింది. దేశంలోకి వేగంగా పెట్టుబడులను రాబట్టడం కోసం, దేశీయ రంగాలను ప్రమోట్ చేయడం కోసం అనేక వ్యూహాలను అనుసరించాలని ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించడంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించేలా రాష్ట్రాలు వ్యూహాలను సిద్ధం చేసుకునేలా మార్గదర్శనం చేసే విషయమై ఈ భేటీలో చర్చించారు.

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు చైనాకు దూరంగా జరుగుతున్నాయి. చైనా సరైన రీతిలో వ్యవహరించకపోవడం వల్లే అమెరికాలో ఈ స్థాయిలో కరోనా విజృంభించిందని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. చైనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయ్యిందని అమెరికా సహా చాలా దేశాలు నమ్ముతున్నాయి. దీంతో చైనాలో పెట్టుబడుల విషయమై పునరాలోచనలో పడ్డాయి. అదే సమయంలో ప్రపంచ దేశాలకు ఔషధాలను సరఫరా చేసిన భారత్.. మంచి మార్కులే కొట్టేసింది. అటు చైనా పట్ల ప్రపంచ దేశాల భయాలు.. ఇటు మన పట్ల ఉన్న సానుకూలతను పెట్టుబడులుగా మార్చుకోవాలని మోదీ సర్కారు భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here