అర్జున్ రెడ్డి సినిమా నా దగ్గర నుంచి కాపీ కొట్టేసారు .. కోర్టుకి వెళుతున్న మరొక డైరెక్టర్ .. కొత్త వివాదం లో అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమా నా దగ్గర నుంచి కాపీ కొట్టేసారు ..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా అర్జున్ రెడ్డి సినిమా చూసావా అనే అడుగుతున్నారు. ఒకవేళ చూడలేదు అంటే చూడమంటున్నారు. చూసేసాం అంటే ఆ సినిమా గురించే డిస్కషన్ లు పెడుతున్నారు. అయితే ఈ సినిమా మీద ఒక కొత్త రకమైన తలనొప్పి వచ్చి పడింది. తాను తెసిన ఇక సెలవ్ అనే సినిమానుంచి అర్జున్ రెడ్డి ని తన దగ్గర పర్మిషన్ లేకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి కాపీ కొట్టాడు అంటూ నాగరాజు అనే సినిమా డైరెక్టర్ కోర్టుకు ఎక్కే పని లో పడ్డారు . గతేడాది తాను తీసిన ఇక సెలవ్ అనే సినిమాకి స్టోరీ లైన్ అచ్చం ఇలాగే ఉంటుంది అనీ కానీ డైరెక్టర్ మాత్రం దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇతర రాష్ట్రాల్లో తీసి కాలేజీ సీన్ లు పెట్టేసి మధ్యలో బూతులు పెట్టి ఒక పోర్న్ సినిమా లాగా తీసారు అని నాగరాజు మండి పడ్డారు. రెండు రోజుల్లో కాపీ చార్జెస్ కింద తనని కలిసి మాట్లాడకపోతే ఈ విషయం మీద కోర్టుకి ఎక్కుతా అని బెదిరించారు నాగరాజు. తన ది కూడా సేం అదే స్టోరీ అనీ తాను ఆ స్టోరీ తో  అల్లు అరవింద్, బెల్లంకొండ సురేష్, మారుతి వంటి వారికి చూపించానని ఆయన చెప్పాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here