అమ్మానాన్న, అన్నావదిన సహా ఆరుగురిని.. దారుణంగా చంపేసిన యువకుడు

మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. డబ్బు కోసం, ఆస్తుల కోసం సొంతవారినే దారుణంగా చంపేస్తున్నారు. అతి కిరాతకంగా అంతమొందిస్తున్నారు. ఆస్తి వివాదం నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను, సొంత అన్నా వదినను అడ్డంగా నరికేశాడో దుర్మార్గుడు. అభంశుభం తెలియని చిన్నారులను కూడా చంపేశాడు. ఈ అత్యంత అమానుష ఘటన యూపీలో జరిగింది.

శివారు ప్రాంతమైన గదౌలీ గ్రామానికి చెందిన అమర్ సింగ్, రామ్‌సాక్షి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల ఆస్తి విషయంలో కుటుంబంలో ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారడంతో అజయ్ సింగ్(26) కుటుంబ సభ్యులను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

Also Read:

అమ్మానాన్న, అన్నావదిన సహా వారి ఇద్దరు పిల్లలను కూడా దారుణంగా హత్య చేశాడు. పదునైన ఆయుధంతో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. మృతులను అమర్(60), రామ్‌సాక్షి(55), అరణ్(40), రామ్‌దులారి(35), సౌరభ్(7), సారిక(2)ను అమానుషంగా అంతం చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విషయం చెప్పి లొంగిపోయాడు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here