అన్నను బావిలో పడేసి చెల్లెలిపై గ్యాంగ్ రేప్.. నిందితల్లో మైనర్లు

లాక్ డౌన్ వేళ కూడా నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. బైక్‌పై వెళ్తున్న అన్నా చెల్లెళ్ళపై దాడిచేసిన నిందితులు యువతి సోదరుడిని బావిలోకి తోసేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని పాధార్ సమీప గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, తన అన్నతో కలిసి బైక్‌పై పెట్రోలు బంకుకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి ఇద్దరూ కలిసి ఇంటికి బయల్దేరారు. అయితే అదే సమయంలో బైక్ హెడ్‌లైట్ పాడైంది. దీంతో మార్గమధ్యంలో ఓ యువకుడు బండి ఆపి దానిని సరిచేయడం ప్రారంభించాడు.

యువకుడు బండిని రిపేర్ చేస్తుండగా… అదే టైంలో రెండు బైకులపై మరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. యువతి సోదరుడిపై దాడిచేసి పక్కనే ఉన్న బావిలోకి తోసేశారు. అనంతరం యువతిని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే ఉన్న మరో నలుగురితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి కేకలు పెడుతున్న వినిపించుకోకుండా ఆమెపై తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. మరోవూపై బావిలోంచి ఎలాగోలా బయటపడిన అమ్మాయి సోదరుడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు అమ్మాయి కోసం గాలింపు చేపట్టారు. అక్కడికి సమీపంలోనే అపస్మారక స్థితిలో అమ్మాయి పడి ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అటు పోలీసులకు కూడా జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు. నిందితుల కోసం గాలించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తనపై ఘాతుకానికి పాల్పడిన నిందితుల్ని బాధితురాలు గుర్తించింది. పరారీలో ఉన్న మరో మగ్గురిని కూడా త్వరలోనే పరారీలో పట్టుకుంటామన్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here