సుజనాచౌదరిపై విజయసాయి లేఖ.. స్పందించిన రాష్ట్రపతి

ఒకప్పటి టీడీపీ రాజ్యసభ ఎంపీ.. ప్రస్తుతం బీజేపీలో చేరిన సుజనాచౌదరికి ఉచ్చు బిగిసేలానే పరిస్థితి కనిపిస్తోంది.. సుజనా చౌదరి దేశీయంగా అంతర్జాతీయంగా మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డాడని.. పలు కంపెనీలు నెలకొల్పి స్కాంలు చేశాడని, ఆయనపై ఈడీ, సీబీఐ విచారణ జరపాలని 26-09-2019న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు.

విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు తాజాగా భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్పందించారు. రాష్ట్రపతి సెక్రెటరీ అశోక్ కుమార్ పాల్ తాజాగా విజయసాయిరెడ్డి ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రెవెన్యూ, ఫైనాన్స్ , డీవోపీఅండ్ టీ శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డికి వివరణ లేఖ పంపారు.

టీడీపీలో కీలకంగా ఉంటూ ప్రత్యర్థిగా ఉన్న సుజనాచౌదరిపై మూడు నెలల క్రితం విజయసాయిరెడ్డి లేఖ రాయగా.. తాజాగా రాష్ట్రపతి స్పందించి కేంద్ర శాఖలకు పంపారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్న సుజనాచౌదరిపై విచారణ జరుపుతారా? కేంద్రం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

విజయసాయిరెడ్డి లేఖ ప్రకారం విచారణ జరిపితే మాత్రం సుజనాచౌదరి చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దీనిపై ఏం చేస్తారన్నది వేచిచూడాలి.

Comments

comments

Leave a Reply

*