ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను తొలగించాలి!

ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ పై ఏపీలోని పలు యూనివర్సిటీ క్యాంపస్ లలో వాల్ పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది. ఆయన ఏపీపీఎస్సీని చెరబట్టి నిరకుంశంగా వ్యవహరిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని.. చైర్మన్ ను తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం చేయాలన్నది ఆ పోస్టర్లలో ఉన్న సారాంశం.

ఇటీవలే ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని.. చైర్మన్ ను మార్చాలని ఏపీ గవర్నర్ కు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వినతి పత్రం అందజేశారు. దీంతోపాటు నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే అన్ని వైపులా నుంచి ఒత్తిడి రావడంతో ఏపీపీఎస్సీ కార్యాలయంలో విధులకు చైర్మన్ ఉదయ్ భాస్కర్ హాజరు కావడం లేదని తెలిసింది. కార్యాలయంలోని తన చాంబర్ లోకి కూడా ఎవరూ వెళ్లకుండా తాళాలు వేసుకొని ఆయన వెళ్లిపోయారని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. అందుకే తాజాగా ఆయనపై వాల్ పోస్టర్లు యూనివర్సిట్లో వెలవడం గమనార్హం.

ఏపీపీఎస్సీ చైర్మన్ తీరు ఆదినుంచి వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉందన్న ఆరోపణలున్నాయి.. చంద్రబాబు హయాంలో నామినేట్ అయిన ఉదయ్ భాస్కర్ వైసీపీ సర్కారు వచ్చినా రాజీనామా చేయకుండా పదవిని పట్టుకొని వేలాడుతూ వైసీపీ సర్కారును ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల వరకూ ఏపీపీఎస్సీ చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయని.. పోస్టులు అమ్ముకుంటున్నారని.. వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు.

ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయ భాస్కర్ నియంతృత్వ పోకడల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ఆయన్ను తక్షణం తొలగించాలన్న డిమాండ్ నిరుద్యోగ సంఘాలు, విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలోనే ఉద్యోగాల కల్పన, పరీక్షల నిర్వహణలో జాప్యం ఏపీపీఎస్సీలో కొనసాగుతోందని.. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని నిరుద్యోగులు ఆరోపిస్తూ పలు యూనివర్సిట్లో పోస్టర్లను అంటించారు. వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉదయ్ భాస్కర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరి ఈ పోస్టర్ల కలకలంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుటుందనేది వేచిచూడాలి.

Comments

comments

Leave a Reply

*