రెండోవారంలో కూడా కొనసావుతున్న అర్జున్ సురవరం హవా, నిఖిల్ ప్రమోషన్స్ యాక్టివిటీస్ కు హ్యాట్సాఫ్ !!!

యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో జంటగా నటించారు. నిఖిల్ తన కెరీర్ లో విభిన్న కథలు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం చిత్రం జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ గా సాగుతుంది. సురవరంపై కొంత బజ్ ఏర్పడింది. చిత్రం విడుదల తరువాత తొలి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ మొదలయింది. దర్శకుడు సంతోష్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఫలితంగా అర్జున్ సురవరం చిత్రం ఊహించడానికంటే ఎక్కువగానే వసూళ్లు రాబడుతోంది.

రెండో వారంలో కూడా సినిమా స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ సీజన్ లో విడుదలైన చిత్రాల్లో అర్జున్ సురవరం టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇటీవల ఈ చిత్రం నిర్వహించిన సక్సెస్ టూర్ కు అనూహ్య స్పందన లభించింది. సెకండ్ వీక్ లో కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో థియేటర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిఖిల్ సినిమా ప్రమోషన్ ను తన భుజాలపైన వేసుకొని ప్రమోట్ చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతను సినిమా కోసం చేస్తున్న యాక్టివిటీస్ కు హ్యాట్సాఫ్.

Comments

comments

Leave a Reply

*