పాజిటివ్ టాక్ తో రిలీజ్ అవుతున్న మిస్ మ్యాచ్

టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ మూవీ మిస్ మ్యాచ్. ఇటీవలే వచ్చిన కౌసల్య కృష్ణ మూర్తి సినిమా తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు మిస్ మ్యాచ్ సినిమాతో మరో వైవిధ్యమైన పాత్ర పోషించింది. ఓ రెజ్లర్ గా ఐశ్వర్య కనిపించనుంది. రెజ్లర్ గా ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ గా కనిపించడానికి మూడు నెలలు పాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిసింది. విలేజ్ అమ్మాయికి తెలివైన అబ్బాయి కి మధ్య సాగె ప్రేమకథ గా ఈ సినిమాను డైరెక్టర్ నిర్మల్ కుమార్ తీర్చిదిద్దినట్లుగా చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రివ్యూలు చూసినవారంతా సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటనకు, హీరో ఉదయ్ శంకర్ నటనకి ప్రసంసలు కురిపిస్తున్నారు. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాతలు శ్రీరామ్, భరత్ ఎక్కడ రాజీపడలేదని, హృదయానికి హత్తుకునే రీతిన దర్శకుడు ఈ సినిమాని రూపొందించినట్లుగా చెబుతున్నారు. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో మిస్ మ్యాచ్ యే రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Comments

comments

Leave a Reply

*