బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ బాధితురాలికి ఆపరేషన్ కోసం ముందుకొచ్చిన వైఎస్ జగన్

హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుండి దూకి వచ్చిన కారు ప్రమాద ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మరణించగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది.ప్రమాదం అనంతరం కుబ్రా బేగంను ఆసుపత్రిలో చేర్చగా ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. సాధారణ పెయింటర్ గా జీవనం సాగించే ఆ యువతి తండ్రి అబ్దుల్ అజీమ్ అంత డబ్బు చెల్లించే స్థోమత లేక సహాయం కోసం ఆసుపత్రి బయట దీనంగా ఎదురుచూస్తున్నాడు.

సాక్షి న్యూస్ లో అత్యంత బాధ కలిగించే ఈ వార్త చూసిన నాకు మనసు చలించి వెంటనే కుబ్రా బేగం చికిత్స పొందుతున్న కేర్ హాస్పిటల్ కు వెళ్ళాను. అక్కడ కుబ్రా బేగం తల్లిదండ్రులతో మాట్లాడి డాక్టర్ ద్వారా ఆపరేషన్ ఖర్చుల వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచెయ్యడం జరిగింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి గారు కుబ్రా బేగం ఆపరేషన్ కోసం సాయం చెయ్యడానికి ముందుకొచ్చారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు తక్షణమే ఆపరేషన్ కోసం కావలసిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందచెయ్యాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా యువతి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

తమ కూతురు ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం చెయ్యడానికి ముందుకొచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. సాయం కోసం ఎదురుచూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ఆపద్భాంధవుడిలా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

పరిస్థితి వివరించిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ ప్రాసెస్ లో సహాయపడిన ఆరోగ్య శ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ గారికి గారికి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారికి, సీఎంఓ అవినాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ..

Comments

comments

Leave a Reply

*