మై లిప్ స్టిక్ ద షేడ్స్ ఆఫ్ లవ్ …. టీజర్ విడుదల

ఉద్యోగం కోసం ఒక పల్లెటూరి నుండి నగరానికి వచ్చిన ఓ దిగువ మధ్యతరగతి అమ్మాయి ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నది..ఆధునిక పోకడల మధ్య తను ఇమడగలిగిందా…?వాటిని అధిగమించి సక్సెస్ అయిందా లేదా అనేది మై లిప్ స్టిక్ ద షేడ్స్ ఆఫ్ లవ్ చిత్రంలో వినోదాత్మకంగా చూపించారు. ఈ చిత్రం టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి కథ.స్క్రీన్ ప్లే.దర్శకత్వం. యస్.సృజన్. స్టైలస్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించింది.. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి మంచి కథ,కథనంతో కూడిన చిత్రం లిప్ స్టిక్. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇది ఒక అమ్మాయి నగర జీవన ప్రయాణం.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో విడుదల కానుంది.

నటీనటులు
దాసరి మధు కమల్, కశ్విరాథోడ్, విదా చైతన్య, సంజీవ్,
దేవా గాదరి, రవినందన్, శ్రీనాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు..

Comments

comments

Leave a Reply

*