గ్రామ స్వరాజ్యం లో సుపరిపాలన

దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదరుచూసిన యువకుల కష్టాలు తీరనున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యం కానిది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సుసాధ్యం చేశారు.  గత చంద్రబాబు ప్రభుత్వం బాబు వస్తే Iజాబు వస్తుంది అనే ప్రకటనకు పరిమితమైతే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం రికార్డు సమయంలో లక్షా 26 వేల మందికి ఉద్యోగాలిచి రికార్డు నెలకొల్పారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత మందికి గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి తాను మాట మనిషిని కాను చేతల మనిషిని అని మరోసారి నిరూపించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో లక్షా 26 వేల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవు.

అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటికిగా నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 11158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తును ఉద్యోగాలు కల్పించడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. కులం, మతం, ప్రాంతం, పార్టీ, వంటి వాటికి అతీతంగా ఈ ఉద్యోగాల కల్పన జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతుంది. గాంధీజి కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో మొదలుకానుంది. గ్రామ ప్రజల సమస్యలు 72 గంటల్లోనే పరిష్కారం అయ్యేలా సచివాలయాలు పనిచేయనున్నాయి.

ప్రతీ సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్లు

గ్రామ, వార్డు సచివాయ పరీక్షలో అర్హత సాధించి ఉద్యోగం పొందిన అభ్యర్థులకు  సోమవారం నాడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియామక పత్రాలు అందచేశారు. అవినీతి లేని పాలన కోసం గ్రామాల్లో అందరూ ఎదురు చూస్తున్నారని, లంచాలు, వివక్షలేని పారదర్శక పాలన మీ ద్వారా అందించాలనుకుంటున్నాని ఉగ్యోగం పొందిన అభ్యర్థులకు తెలియజేశారు. తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా ఉగ్యోగాలు ఇవ్వడం గొప్ప విజయమన్నారు. మనమంతా ప్రజా సేవకులమని ప్రజలకు సేవ చేయడానికి ఈ ఉద్యోగాలు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు పొందని అభ్యర్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని ప్రతీ యేటా జనవరిలో 1 నుంచి 30 లోపు ప్రభుత్వ శాఖలో ఏర్పడిన ఖాళీను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

జాతి మీడియాతో మతిలేని మాటలు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ పేరుతో టిడిపి నేతలు ఎలా దోచుకుతిన్నారో తెలిసిన విషయమే. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వనిదే జరిగని పరిస్థితి ఉండేది. అలాంటి పచ్చ పార్టీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంత పెద్దస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుంటే పచ్చమీడియా మాత్రం పేపర్‌లీకేజ్‌ అని, 5 లక్షలకు అమ్ముకున్నారని, పార్టీవారికి ఇస్తున్నారని బురద జల్లాలని ప్రయత్నించి విఫలం అవ్వడంతో చంద్రబాబు తానే రంగంలోకి దిగి తన స్థాయిని తగ్గించుకునే వాఖ్యలు చేస్తున్నారు.

ప్రభుత్వం ఒకవైపు ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుంటే చంద్రబాబు, పచ్చ మీడియాకు ఏమాత్రం రుచించడం లేదు. గ్రామ వాలంటీర్, సచివాలయ ఉద్యోగులపై టిడిపి అధినేత చంద్రబాబు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. కేవలం ఐదు వేల రూపాయలు జీతంతో గోనె సంచులు మోసే ఉగ్యోగాన్ని ఇచ్చారంటూ, గ్రామ వాలంటీర్లు మహిళపై అఘాయిత్యాలకు ప్పాడుతున్నారని వారిని కించ పరిచేలా వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అయిదేళ్ల అధికారం అనుభవించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఇప్పుడు వైసీపీ సర్కార్‌ ఉద్యోగాలు కల్పిస్తుంటే మాత్రం ఓర్వలేక ఉద్యోగం పొందిన అభ్యర్థును కింపపరుస్తూ మాట్లాడడం ఆయన 40 ఏళ్ల అనుభవానికి అద్దం పడుతున్నది.

గ్రామాల్లో వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులతో గ్రామ స్వరాజ్యం వైపు వైసీపీ సర్కార్‌ అడుగు వేసింది. రికార్డు స్థాయిలో లక్షా 26 వేల 728 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డి ఎంపికైన వారందరికీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ జిల్లాల వారిగా అందచేశారు.

గాంధీ జయంతి అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలు పల్లెపల్లెన జనం కష్టనష్టాలను తీర్చేపనిలో నిమగ్నులవుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ తరహాలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తొలిసారిగా ఏపీలోనే ప్రారంభమైంది. ప్రతి యాబై కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్, మున్సిపాలిటీల్లో వార్డు వాలంటీర్లను నియమించడం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చేందుకు గ్రామ సచివాలయాలను జగన్‌ ప్రారంభించారు.

నవరత్నాలతో పాటు మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో గ్రామ సచివాలయాల పనితీరుపై తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్‌ నుండే పరిశీలించనున్నారు. ప్రతి సచివాలయంలో పదకొండు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు పనిచేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ఉద్యోగులతో కొత్త వ్యవస్థను సృష్టించడం వల్ల ప్రభుత్వ పథకాలు అర్హులకు ఇంటింటికీ చేరేలా పకడ్బంధీంగా జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు గాంధీ జయంతి నాటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

.

Comments

comments

Leave a Reply

*