నమ్మకానికి నేస్తం..విశ్వాసానికి విధేయుడు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పుత్తా ప్రతాప్‌రెడ్డి

తిరుపతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుత్తా ప్రతాపరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో సముచిత స్థానం దక్కింది. ఇటీవలే ఆయన్ను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నియమించారు. పుత్తా ప్రతాపరెడ్డి మొదటి నుంచి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెన్నంటే నిలిచారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అధినేతకు అన్ని వేళలా తోడుగా నడిచాడు. ఆయన విధేయతే ఆయనకు పదవిని తెచ్చి పెట్టిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. పుత్తా ప్రతాపరెడ్డికి కీలకమైన బాధ్యతలను అప్పగించడంపై పార్టీ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

పుత్తా ప్రతాప్‌రెడ్డి..వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ యువజన విభాగం, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అనేక సేవలందించారు. చంద్రబాబు నాయుడు పై నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్న పుత్తా ప్రతాప్‌రెడ్డి గత ఎన్నికల సమయంలో వైయస్‌ఆర్‌సీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. రాత్రనక పగలనక ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక పోషించారు.

నమ్మకంగా నడిచాడు..శ్రీవారి ఆశీస్సులు పొందాడు

పుత్తా ప్రతాప్‌రెడ్డి మొదటి నుంచి కూడా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంట నమ్మకంగా నడిచాడు. కష్టకాలాల్లో తోడుగా నిలిచాడు. అందుకే ఆయన అడగకుండానే పదవి వరించింది. పుత్తా ప్రస్థానాన్ని ఒక్కసారి గమనిస్తే..
కడప జిల్లాలో పుట్టిన పుత్తా ప్రతాప్‌రెడ్డి అఖిల భారత్‌ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) తరఫున రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేశారు. రామాంతపూర్‌లోని జేఎన్‌యూ కాలేజీలో 1990- 1991వ సంవత్సరంలో నిర్వహించిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో జాయింట్‌ సెక్రటరీగా, 1929-93 జనరల్‌ సెక్రటరీగా, 1993-1994 ప్రెసిడెంట్‌గా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో పేపర్‌ లీకేజీ అయిన ఘటనపై పోరాటం చేయడంతో బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. యూనివర్శిటిలో విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి జైలుకు కూడా వెళ్లారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మొదటి నుంచి కూడా అత్యంత సన్నిహితుడిగా ఉంటూ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2010లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి కార్పొరేట్‌గా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి 41 ఓట్లతో ఓటమి చవి చూసినా..ప్రజా సమస్యలపై పోరాటం ఆపలేదు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించినప్పటి నుంచి జననేత వెంటే ఉన్నారు. విద్యార్థి, యువజన విభాగం అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పని చేసి పార్టీ ప్రజా సంఘాల బలోపేతానికి కృషి చేశారు. 2010-2019 వరకు వైయస్‌ఆర్‌సీపీ చేపట్టిన పలు ప్రజా సమస్యలపై అందోళన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. దీంతో ఆయనపై ప్రభుత్వాలు 43 కేసులు పెట్టారు. వైయస్‌ జగన్‌ అరెస్టు అయిన సమయంలో ఆందోళన చేపట్టడంతో ప్రతాప్‌రెడ్డిని జైలుకు పంపించారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర ఇలా పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ప్రతాప్‌రెడ్డి తాను ముందున్నారు. 2019 ఎన్నికల ప్రచారం కోసం రావాలి జగన్‌..కావాలి జగన్‌ అనే పాటను స్వతహాగా ప్రతాప్‌రెడ్డినే చేయించారు. ఎన్నికల వేళ ఆ పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ..నాయకులకు తలలో నాలుకగా మెలిగారు. ఆయన కష్టాన్ని గుర్తించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలిచి మరీ ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమించారు. అడగకుండా వైయస్‌ జగన్‌ ఆయనకు పదవినిచ్చి సముచిత స్థానం కల్పించారు. వైయస్‌ జగన్‌ కష్టాల్లో ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి పదవులు ఇస్తామని ప్రలోభపెట్టినా జననేత వెంటే నడిచారు తప్ప..వేరే పార్టీల వైపు కన్నెత్తికూడా చూడలేదు. ఈ నిజాయితీనే ఆయనకు కలిసి వచ్చింది.

దేశ భక్తి..ఆధ్యాత్మికత ఎక్కువే..
విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఏబీవీపీలో పని చేయడంతో మొదటి నుంచి కూడా దేశభక్తి, ఆధ్యాత్మికత కూడా పుత్తా ప్రతాప్‌రెడ్డికి ఎక్కువగానే ఉంది. అటు విద్యార్థి నాయకుడిగా, తరువాతి కాలంలో రాజకీయ పార్టీలో చురుకైన లీడర్‌గా ఎదగడం వెనుక ఆయన కృషి, పట్టుదల, నిజాయితీ, విధేయతలే కారణం. రాజకీయంగానే కాదు ఆధ్యాత్మికంగానూ విశిష్టత కలిగి ఉన్న వ్యక్తి పుత్తా. తన 20వ ఏటనే హైదరాబాద్‌ వనస్థలిపురంలో పెద్ద షిరిడీ సాయిబాబ ఆలయాన్ని నిర్మించి, అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సమర్ధవంతంగా పనిచేస్తారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నమ్మి..ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 23వ తేదీ టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను పార్టీ శ్రేణులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

Comments

comments

Leave a Reply

*