నమ్మకానికి జగన్ ఇచ్చిన గుర్తింపు ఇదీ

నమ్ముకున్న వారిని ఆదరించడం లో వైఎస్ కుటుంబం తరువాతే ఎవరైనా …
సీఎం కు …………..గా నియమితులైన చిన్నపిల్లల వైద్యుడు డా.హరికృష్ణ అందుకు ఉదాహరణ . విద్యార్థి నాయకుడిగా ( ఏపీజేయుడీఏ రాష్ట్ర అధ్యక్షుడు)గా ఉన్నపుడు వైఎస్సార్ తో ఏర్పడిన అనుబంధం , అభిమానం ఆ కుటుంబంతో కొనసాగింది. ఆ అభిమానమే శర్మిలమ్మ తో 3112 కి.మీ జగన్ గారితో 3648 కిమీ పాదయాత్రలలో పూర్తిగా నడిచేలా చేసింది. గత ఎన్నికలలో శర్మిళగారికి ఈ ఎన్నికలలో విజయమ్మ గారికి ప్రచారంలో వెన్నంటి నిలిచేలా చేసింది.

నిజాయితీ, అంకితభావం, విధేయత వైఎస్ కుటుంబానికి విశ్వాసపాత్రుణ్ణి చేసింది.డాక్టర్ హరిక్రిష్ణ కోడిగేనహళ్లిలో పాఠశాల విద్యను, లొయోల కాలేజీలో ఇంటర్, కర్నూల్ మెడికల్ కాలేజి లో ఎంబీబీఎస్, నిలౌఫర్ ఆస్పత్రి లో చిన్న పిల్లల వైధ్యం చదివారు . పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో రోజూ వందలాది మంది చిన్నపిల్లలకు వైద్య సేవలు అందిస్తూ మంచి వైద్యునిగా పేరు సంపాదించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్పూర్తితో బీజీ ప్రాక్టీస్ ను వదిలేసి వైఎస్ కుటుంబం వెంట నడిచారు. తన సమీప బంధువులైన భూమా, ఎస్వీ కుటుంబాలు టీడీపీ లో చేరినా … ఆయన మాత్రం జగన్ గారి వెంటే నడిచారు. పాదయాత్ర లో ప్రతినిత్యం జగన్ గారి అడుగులో అడుగేస్తూ ….ప్రజలు జగన్ గారికిచ్చే వినతులు స్వీకరించేవారు.

జగన్ గారి ఆదేశాల మేరకు ఎంతో మందికి వైద్యసహాయం అందేలా చేశారు. ముఖ్యమైన సమాచారాన్ని, రహస్య విషయాలను జగన్ గారి కి చేరవేసేవారు. జగన్ గారికి అత్యంత నమ్మకస్థులైన అనుచరులలో ఒకరి గా స్థానం సంపాదించారు. ఇప్పుడు సామాన్య మధ్యతరగతికి చెందిన హరిక్రిష్ణ కు సీఎం పేషీ లో అధికారిగా పనిచేసే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు.

Comments

comments

Leave a Reply

*