బాబు పై బంపర్ సినిమా… ఓటు వేసే లోపు ఒక్కసారైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో…

నిప్పులాంటి నిజం అనే టైటిల్ తో యూఎస్ఏ వైస్సార్సీపీ నాయకులు టీపిరెడ్డి యానిమేషన్ లఘు చిత్రాన్నినిర్మించారు. ఎన్నికలలో నాయకులు ఇచ్చే మోసపూరిత హామీల వలన జరిగే పర్యవసానాలను ఇందులో చాలా చక్కగా చూపించారు. ఉగాది పర్వదినాన వైఎస్ షర్మిల గారు ఈచిత్రాన్నివిడుదలచేయనున్నారు.2014 ఎన్నికలలో మోసపూరితమైన హామీలను ఇచ్చి, తీరా ఎన్నికలయ్యాక ప్రజలను వంచించాడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.

అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, గెలిచాక రైతులకు మొండి చేయి చూపాడు. ఒక విడత రుణమాఫీ చేసి రైతులను నట్టేట ముంచాడు. రుణమాఫీ అవట్లేదని రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన ప్రయోజనం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా రుణమాఫీ చేయకపోగా,  ఏకంగా హామీనే బాబు మాఫీ చేసాడు. పూర్తిగా రుణమాఫీ చేయమని అడిగితే ఒక విడత చేసాం కదా ఇంకేం చేస్తాం అది కుదరదంటూ రుణమాఫీ అవుతదనుకున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇటు రుణమాఫీ కాక అటు బ్యాంకు అధికారుల నుండి ఋణం చెల్లించమనే ఒత్తిడులతో ఎంతో మంది అన్నదాతలు తమ ప్రాణాలను వదులుకున్నారు. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఇంబర్సుమెంట్ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులకు చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు రాలేకపోవడం, ఇటు రుణమాఫీ కాకపోవడంతో ఎంతో మంది రైతుల బలవన్మరణాలకు చంద్రబాబు కారణమయ్యాడు. రైతుల రుణమాఫీకి నేను బాధ్యత తీసుకుంటున్నా, మిమ్మల్ని నా భుజాల మీద మోస్తా అని, జాబు కావాలంటే బాబు రావాలని అబద్దపు ప్రచారాలను నమ్మి, ప్రజలు అనుభవం ఉన్న వ్యక్తి అని ఓటు వేస్తే చివరికి ప్రజలు మోసపోవాల్సి వచ్చింది. ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల రుణాలు సంపూర్ణంగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మహిళలకు మొండి చేయి చూపించాడు.

ఇక ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో కొత్త నాటకానికి తెర లేపాడు. గతంలో 9 ఏళ్ల బాబు పరిపాలనను చూసినప్పటికీ నేను మారాను, నన్ను నమ్మండి అని కల్లిబొల్లి మాటలతో ప్రజలను నమ్మించాడు. నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచాడు. ఇచ్చిన 600 హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇపుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలకే దిక్కులేదు ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో ముందుకొస్తున్నాడు. ఇదేదో చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నట్టు సొంత తల్లికి అన్నం పెట్టనివాడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నాడట, అన్నట్టు ఉంది బాబు వ్యవహారం. ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు దివంగతనేత జనరంజక పాలన గుర్తుకు వస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు వైఎస్సార్ గారు. మాట తప్పడం మడమ తిప్పడం తెలియని వ్యక్తిత్వం ఆయనది. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఉచిత కరంట్, రైతు రుణమాఫీలతో పేద ప్రజల గుండెల్లో నిలిచారు.

ఇక ఈ సమయంలో వైఎస్సార్ లాంటి మాట మీద నిలబడే నాయకుడు కావాలి రాష్ట్రానికి. సరిగ్గా అలాంటి లక్షణాలు కలిగిన ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి లాగే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, విలువలతో కూడిన రాజకీయం చేయడం, నేనున్నానే ఆపన్న హస్తం అందించగలిగే లక్షణాలు ఆయన సొంతం. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలపక్షాన పోరాడుతున్నాడు. నవరత్నాలతో నవ్యాంధ్రకు మార్గం చూపనున్నాడు. ఈసారి జగన్ ని గెలిపించి రాజన్న రాజ్యం మళ్ళీ తెచ్చుకోవాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. అబద్దపు వాగ్దానాలతో ప్రజలను వంచించే నాయకులకు బుద్దిచెప్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడిని ఎన్నుకోవడానికి ఆంధ్ర దేశం సిద్ధంగా ఉందని ఈ చిత్రంలో చక్కగా చూపించారు.

Comments

comments

Leave a Reply

*