ప్రతీ నిరుద్యోగికి బాబు బాకీ 1.20లక్షలు

అధికారం కావాలి.. అంతే.. అందుకే నరం లేని నాలుకతో బాబు హామీల వరద పారించాడు. అధికారంలోకి వచ్చాడు. తీరా వాటిని అమలు చేయలేక మోసం చేశాడు. ఇలానే సాగితే ఈ ఎన్నికల్లో ఓటమి తథ్యం అని భావించి.. అన్నింటికి నిధులు ఆపించేసి మూడు నెలల ముందు బాబు అలివికానీ హామీల అమలును అమలు చేశాడు.

ఒక్కో నిరుద్యోగికి నిరుధ్యోగ భృతి పేరిట 1.20 లక్షలు బాబు బాకీ పడ్డాడు. కానీ ఎన్నికలకు మూడు నెలల ముందు ఒక్కొక్కరికి 2 వేలు చొప్పున కేవలం 6 వేలు చెల్లించి అదీ కొందరికే ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చేశాడు. బాబు చేస్తున్న మోసంపై రగిలిపోతున్న నిరుద్యోగులు ఇప్పుడు తగిన బుద్ధి చెప్పేందుకు రెడీ అయ్యారట..

ఇక పేదలను ఇళ్ల పేరిట మోసం చేసిన బాబు నైజం మరోసారి బయటపడింది. అధికారంలోకి వస్తే 1.75 కోట్ల ఇళ్లు కట్టిస్తామని పేదలకు ఆశచూపాడు.. నమ్మి ఓట్లేశారు. వారిని బాబు నట్టేట ముంచారు. ఎన్నికలకు ముందు కేవలం 3 లక్షల ఇళ్లు మాత్రమే కట్టించి చంద్రబాబు పేదలను దారుణంగా మోసం చేశారు. కోట్ల మంది ఉంటే లక్షల ఇళ్లు మాత్రమే ఇచ్చి భూతల స్వర్గంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు పేదలు కూడా హామీ ఇచ్చి మోసం చేసిన బాబుకు బుద్ది చెప్పేందుకు రెడీ అయ్యారట..

Comments

comments

Leave a Reply

*