ఇచ్చింది పుచ్చుకుందాం – చుక్క‌లు చూపిద్దాం

ఇచ్చింది పుచ్చుకుందాం – చుక్క‌లు చూపిద్దాం ఇదే ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌ స్టేట‌జీ అంటున్నారు. అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అడ్డంగా మోసం చేసింద‌నే కోపం ప్ర‌జ‌ల్లో ఉంది. ఎన్నిక‌ల‌కు ప‌దిరోజులున్నాయి. గ‌త 20 రోజులుగా దేశం నేత‌లు విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు, మందు పంప‌కాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయిల డ‌బ్బు తెలుగు త‌మ్ముళ్ల వ‌ద్దే ప‌ట్టు బ‌డుతోంది. పోలీసులే ప‌చ్చ కార్య‌క‌ర్త‌ల్లా మారి డ‌బ్బులు పంచుతున్నారు.

ప్ర‌జ‌ల‌కు ఐదేళ్లుగా ఏమీ చేయ‌కుండా ఎల‌క్ష‌న్ల ముందు తాయిలాల‌తో ఓట్లు కొట్టేయాల‌నుకుంటూ, నోట్ల‌తో ఓట్ల‌ను కొనేయాల‌ని చూస్తున్న దేశం నేత‌ల‌కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌నుకుంటున్నారు తెలుగు ప్ర‌జ‌లు. అందుకే ఆ పార్టీ ఇచ్చే డ‌బ్బులు పుచ్చుకోవాల‌ని, ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి చుక్క‌లు చూపించాల‌ని డిసైడ్ అయ్యార్ట‌. సోష‌ల్ మీడియాలో ఈ త‌ర‌హా మాట్లాడుతున్న వారు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నారు.

Comments

comments

Leave a Reply

*