మీడియాకు ఇవేం ప‌ట్ట‌వా?

టీవీ న్యూస్ ఛానెల్స్ అంటే జనానికి అసహ్యం, జుగుప్స కలుగుతోంది. టీవీ ఛానెల్స్ ను ఎవరైనా తిట్టినా, జర్నలిస్టులను కొట్టినా జనం తెగ ఆనందపడిపోతున్నారంటే టీవీ మీడియా ఎంత అరాచక శక్తిగా తయారైందో ఊహించుకోవచ్చు. మీడియా అంటే ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఊహించుకున్నారు. కానీ రాను రాను మీడియా ఒక లైసెన్సెడ్ ప్రైవేట్ మాఫియాగా తయారైపోయింది. పోలీసు వ్యవస్థ కన్నా, మీడియా ఈరోజు మరింత దుర్మార్గంగా తయారైంది. ప‌త్రిక విలువ‌లు కాల‌రాస్తూ ఒక్క రాజ‌కీయ పార్టీకి మేలు చేసేలా క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం, డిబెట్లు పెట్ట‌డంపై సామాన్య జ‌నం అస‌హ్యించుకుంటున్నారు.

ఇటీవ‌ల చంద్ర‌బాబు బీసీ వ‌ర్గానికి చెందిన గోరంట్ల మాధ‌వ్ వీఆర్ఎస్ ఆమోదం పొంద‌కుండా చంద్ర‌బాబు ద‌గ్గ‌రుండి మ‌రీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. అదే టీడీపీకి చెందిన ఐఏఎస్ అధికారి రామాంజ‌నేయులు వీఆర్ఎస్ తీసుకుంటే రాత్రికి రాత్రే ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈయ‌న ప్ర‌స్తుతం కోడుమూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్య‌ర్థిగా నిల‌బ‌డ్డారు. ఈ అంశంపై ఏ ఒక్క మీడియా కూడా చ‌ర్చ పెట్ట‌డంకానీ..వార్త‌లు రాయ‌డం కానీ మ‌రిచింది. ఏ ఒక్క మీడియా కూడా బీసీల‌కు మ‌ద్ద‌తుగా చ‌ర్చ‌లు పెట్ట‌కుండా చంద్ర‌బాబుకు మేలు చేసే విధంగా ఇత‌ర అంశాల‌పై డిబెట్లు పెడుతున్నారు.

కేసీఆర్ ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తిస్తామంటే జ‌గ‌న్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇచ్చారు. ఈ విష‌యాన్ని ప‌చ్చ మీడియా బూత‌ద్దంలో చూపి ఇదేదో ఆంధ్రుల ఆత్మ గౌర‌వం అంటూ అడ్డగోలుగా చర్చలు జరుపుతుంది. అదే టీడీపీ కి ఇటువంటి అవకాశం వచ్చి ఉండింటే మొత్తం బీసీ ఓట్లను ప్రభావితం చేసేటుగా మీడియాలో చర్చలు నడిపేవాళ్లు. టీడీపీ ఇన్ని వైఫ‌ల్యాలు ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా మీడియాలో డిబెట్ పెట్ట‌డం లేదు. చంద్ర‌బాబు ఇటీవ‌ల తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తే ఒక్క సీటు గెల‌వ‌లేదు.అలాంటి చంద్ర‌బాబు దేశ రాజకీయాల్లో చ‌క్రం తిప్ప‌బోతున్నాడ‌ని ఊద‌ర‌గొడుతున్నారు.

తెలంగాణ‌లో సెటిల‌ర్స్‌పై దాడులు చేస్తున్నార‌ని ప‌వ‌న్‌, చంద్ర‌బాబు అంటున్నారు. మ‌రీ ఇక్క‌డ మీడియా సంస్థ‌లు పెట్టి స్థిర‌ప‌డ్డ అధినేత‌లు ఈ విష‌యంపై ఎందుకు చ‌ర్చ‌లు పెట్ట‌డం లేదు. క‌థ‌నాలు రాయ‌డం లేద‌ని సెటిల‌ర్స్ ప్ర‌శ్నిస్తున్నారు. ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేదు. ఇన్నాళ్లు ఎవ‌రు కూడా ఇలాంటి ఫిర్యాదులు చేయ‌లేదు. కేవ‌లం ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌నే భావ‌న‌తోనే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు త‌ర‌ఫున ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు వ‌చ్చి ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్ మాత్రం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం జ‌గ‌న్‌ను కోర‌డంత‌ప్పు అన్న‌ట్లుగా చిత్రీక‌రిస్తున్నారు. ఇదెక్క‌డి న్యాయ‌మో ఆ మీడియా అధినేత‌లే ఆలోచించుకోవాలి. ఇలాగే మీడియా సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త‌ను, నిజాయితీని కోల్పోయే అవ‌కాశం ఉంది.

Comments

comments

Leave a Reply

*