జగన్ హామీలు కాపీ కొట్టిన బాబు..

కాపీ.. కాపీ.. కాపీ.. ఒకరిని చూసి మరొకరు కాపీ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ఇతరుల మేనీఫెస్టోను కాపీ కొడుతూ కుట్రలకు పాల్పడుతోంది. ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, తాను చేసిన పనులు చెప్పుకోకుండా ఇతరుల హామీలు కాపీ కొడుతున్నాడు. మొన్నటి వరకు పింఛన్‌ 2వేలు ఇస్తామని చెప్పిన చెప్పిన టీడీపీ అధినేత, వైసీపీ నేత జగన్‌ రూ.3వేల పింఛన్‌ అనగానే బాబు మళ్లీ మాట మార్చాడు. ఇప్పుడు తాను కూడా రూ.3వేల పింఛన్‌ ఇస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల మేనిఫెస్టోలను తయారు చేస్తాయి పార్టీలు. ఇందులో భాగంగా వైసీపీ తన మేనిఫెస్టోలో వృద్ధులకు రూ.3వేల పింఛన్‌ ప్రకటించారు. ఇప్పటివరకు వృద్ధులకు కేవలం రూ.వెయ్యి వరకే పింఛన్ ఇచ్చిన బాబు గత రెండు నెలల కిందటే రూ.2వేలు చేశారు. ఇప్పుడు వైసీపీని చూసి తాను కూడా రూ.3వేల పింఛన్‌ ఇస్తానంటున్నాడు.

సంకల్పయాత్రలో భాగంగా జగన్‌ అన్ని కులాల వారిని ఆదరిస్తామని చెప్పారు. అందులో భాగంగా వారి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా బీసీలకు ప్రాధాన్యనిస్తానని చెప్పారు.

బీసీ కులాలను ఆదరిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు వారికి వస్తువులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ‘ఆదరణ’ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 3 లక్షల మంది డిపాజిట్లు కట్టినవారున్నారు. వారిలో కనీసం రెండు లక్షల మందికైనా వస్తువులు అందించలేదు. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్‌ ఓ ప్రచారసభలో ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని కాపీ కొట్టిన బాబు 11 బీసీ కులాలను కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం విశేషం.

ఇలా ప్రతీ విషయాన్ని కాపీ కొడుతూ ఓట్ల కోసం కొత్తదారులు తొక్కుతున్నారు బాబు. దీనిని బట్టి తాను ఐదేళ్లలో ఏం చేయలేదని అర్థమవుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఒకవేళ అభివృద్ధి చేసి ఉంటే వాటిని ప్రచారం చేసుకోవచ్చుగా..? అని సూచనలిస్తున్నారు.

Comments

comments

Leave a Reply

*