తాజాగా ఇటీవల విడుదలైన దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు థియేటర్లో హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారని చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖుల ప్రశంసలు అందించారు. ఇదే క్రమంలో ఈ సినిమా పై చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో సినిమా కి అద్భుతమైన ప్రశంసలు అందించారు..మోహన్ బాబు, నారా లోకేష్ వంటి పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసారు. బాలకృష్ణతో కలిసి సినిమా చుసిన నందమూరి సుహాసిని కూడా బాలకృష్ణను, సినిమా యూనిట్ ను ప్రసంశల్లో ముంచెత్తారు.” తాతగారి( ఎన్టీఆర్) పాత్రలో బాబాయ్, నాన్న(హరి కృష్ణ) గారి పాత్రలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని అన్నారు సుహాసిని. ఈ చిత్రం ద్వారా తనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నానని అన్నారు, ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం హైలైట్ అని, దర్శకుడు క్రిష్ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. బాలకృష్ణ, బ్రాహ్మణి, క్రిష్ లతో పాటు ఆమె సినిమా చూసారు. సాధారణ ప్రేక్షకుడిలా సినిమా చూశానని, ఇందులో నటీనటులు అందరు చక్కగా నటించారని ప్రశంసించారు సుహాసిని.

Comments

comments

Leave a Reply

*