సంచలనం రేపుతున్న వైయస్సార్ ‘యాత్ర’ కొత్త వార్త..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర టైటిల్ పేరిట తెరకెక్కించిన విషయం మనకందరికీ తెలిసినదే. డైరెక్టర్ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా.. ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు సినిమా యూనిట్. ట్రైలర్ లో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని చూస్తే తెలిసిపోతుంది. మొత్తంమీద ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మరో పక్క ఈ సినిమా గురించి కొత్త వార్త సినిమా ఇండస్ట్రీ లో వినపడుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడు,వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రానున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్ర‌వరి 1వైజాగ్‌లో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు.వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి విజ‌య‌మ్మ కూడా ఈ ఫంక్ష‌న్‌కు రానున్న‌ట్లు స‌మాచారం. వైయస్సార్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు సంబంధించిన క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు.ఈ సినిమాలో వైఎస్ విజ‌య‌మ్మగా బాహుబ‌లి యాక్ట‌ర్ ఆశ్రిత వేముగంటి న‌టించింది. వైఎస్ రాజారెడ్డిగా జ‌గ‌ప‌తి బాబు న‌టించారు.జ‌గ‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావ‌డంతో ‘యాత్ర’ సినిమాకు బ‌జ్ పెర‌గ‌డం ఖాయం అంటున్నారు సినీ విశ్లేష‌కులు.

Comments

comments

Leave a Reply

*