మరోసారి బాలకృష్ణ కు షాక్ ఇచ్చిన నాగేంద్రబాబు..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాలకృష్ణ మరియు నాగ బాబు వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో సోషల్ మీడియాలో బాలకృష్ణపై నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఇటీవల నందమూరి అభిమానులు ఎంతగానో ఆగ్రహం చెందారు. అయితే ఈ గొడవ ఇంకా సద్దుమణగని క్రమంలో మరొకసారి నందమూరి అభిమానులకు బాలకృష్ణ కు షాక్ ఇచ్చాడు నాగేంద్రబాబు. తాజాగా ఇటీవల గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఓ షార్ట్ ఫిలిం తీశాడు నాగబాబు. అంతేకాకుండా దీన్ని సోషల్ మీడియాలో కూడా విడుదల చేశాడు. అయితే షార్ట్ ఫిలిం కి ఎర్రోడి వీరగాధ అనే టైటిల్‌ పెట్టాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నాగ‌బాబే స్వ‌యంగా న‌టించ‌డం విశేషం. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఓ వ్య‌క్తిని ప‌ట్టుకుని కొంద‌రు మ‌హిళలు కొడుతుంటారు. అక్క‌డే ఉన్న నాగబాబు ఇది చూసి వారిని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌కుండా వెళ్లిపోతాడు. మ‌ళ్లీ అదే వ్య‌క్తిని వేరే సెంట‌ర్‌లో అదే మ‌హిళ‌లు కొడుతుంటే చూసి మ‌న‌కెందుకులే అని అక్క‌డ నుంచి వెళ్లిపోతాడు నాగ‌బాబు. అలా వెళ్లిపోతున్న నాగ‌బాబు కారుకి అడ్డంగా వచ్చి పడ‌తాడు ఆ వ్య‌క్తి. స‌డ‌న్‌గా ఏం జ‌రిగిందో తెలియ‌ని నాగ‌బాబు, అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఏం జ‌రిగింద‌ని ఆ వ్య‌క్తిని అడ‌గ్గా.. ఆ వ్య‌క్తి మాట్లాడుతు.. ”ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని పెద్దలు అన్నారు కదా..అని నేను ముద్దు పెట్టడానికి ప్రయత్నించానని” చెబుతాడు. ఈ మాట‌లు విన్న వెంట‌నే నాగ‌బాబు అక్క‌డ ఉన్న మ‌హిళ‌ల‌ను పిలిచి మ‌రి వారి చేత కొట్టిస్తాడు. ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం చూసిన త‌రువాత టైట‌ల్ రోల్ ప్లే చేసిన బాల‌య్య‌ను ఎర్రోడిని చేశాడు నాగ‌బాబు. ఇప్ప‌టికే నాగ‌బాబు మీద గుర్రుగా ఉన్న బాల‌య్య అభిమానులు, ఈ వీడియో చూసిన త‌రువాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Comments

comments

Leave a Reply

*