మరొక సంచలన సినిమా లైన్ లో పెట్టిన హీరోయిన్ సమంత..!

ప్రస్తుతం సమంత తన భర్త అక్కినేని నాగ చైతన్య తో మంచి టూర్ లో ఉంది. గతంలో పెళ్లయిన తర్వాత ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డా వీరిద్దరు తాజాగా పెళ్లి జీవితాన్ని ఆహ్లాదకరంగా నెదర్లాండ్ దేశంలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తున్నారు. ఒకపక్క శివ నిర్వాణ దర్శకత్వంలో హీరోయిన్ గా సమంత తన భర్త నాగచైతన్యతో మజిలీ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమా అయిన వెంటనే డైరెక్టర్ నందినీరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్న సమంత తాజాగా మరో ప్రాజెక్ట్ లైన్ లో పెట్టి నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.  మొదటి ప్రయత్నంగా ‘అ!’ సినిమాను నిర్మించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాకు ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన నానికి ఒక ఇంట్రెస్టింగ్ ఫిమేల్ ఓరియెంటెడ్ కథను వినిపించాడట. నాని కి నచ్చడంతో ఈ కథ గురించి వారిద్దరూ సమంతాతో కూడా మాట్లాడారట.అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మరో రెండు నెలల్లో సెట్స్ పైకి వెళ్తుందని సమచారం. ఈ సినిమాద్వారా ఒక నూతన దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడట మన న్యాచురల్ స్టార్. నాని నిర్మాణంలో విజయేంద్రుని కథతో సమంత సినిమా.. వినడానికే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా?

Comments

comments

Leave a Reply

*