‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన పాత్ర గురించి కామెంట్ చేసిన చెర్రీ..!

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ జనవరి 11న విడుదల కాబోతున్న క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చెర్రీ..వినయ విధేయ రామ సినిమాలో తన పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు. ఈ సినిమాలో రామ్ పాత్రలో నటించాను. ప్రతి ఇంట్లో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అనుకునే పాత్ర నాది. రాముడు టైప్లో వినయంగా వుంటూ అవసరమైతే విధ్వసం కూడా సృష్టించే టైప్ లో ఉంటుంది ఈ పాత్ర అంటూ తెలియజేశారు. అంతేకాకుండా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలు కూడా తెలియజేశారు చెర్రీ. ఆర్ఆర్ఆర్ సినిమాలో  రాజమౌళి మళ్లీ డి గ్లామరైజ్డ్ పాత్రను సృష్టించారు. ఈపాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈసినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచుస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం ఈ సినీమాకే కేటాయించాను…అని చెప్పుకొచ్చారు.

Comments

comments

Leave a Reply

*