వివాదాస్పదంగా మారిన తెలుగు సినిమా హాల్స్..!

ప్రస్తుతం తెలుగు సినిమా రంగం బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందర్భంగా బడా బడా సినిమాలు విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు సినిమాలు పెద్ద హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఎన్టీఆర్ కాథానాయ‌కుడు, విన‌య విధేయ రామ‌, ఎఫ్‌2 చిత్రాలు, త‌మిళ డ‌బ్బింగ్ పేట చిత్రం ఒక్కో రోజు వ్య‌వ‌ధిలో విడుద‌ల కానున్నాయి. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న సినిమాలకు థియేటర్లు సరిగ్గా దొరక్కపోవడంతో సినిమా హాల్స్ డిమాండ్ పెరిగింది.ఈ క్ర‌మంలో తెలుగు సినిమాలు పూర్తిగా ధియేట‌ర్ల‌ను ఆక్ర‌మించ‌గా..అనువాద చిత్రం ‘పేట‌’ చిత్రానికి ధియేట‌ర్లు క‌రువు అయ్యాయి. దీంతో తెలుగులో పేట‌ను రిలీజ్ చేస్తున్న నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ధియేటర్ల మాఫియా కొనసాగుతోందని దానిని అడ్డుకోమని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోర‌తామ‌ని నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని అన్నారు. ఇండ‌స్ట్రీలో న‌లుగురు క‌లిసి మాఫీయాగా ఏర్ప‌డ్డార‌ని, ముఖ్యంగా అల్లు అర‌వింద్, దిల్ రాజు, యువీ క్రియేషన్స్ వారు క‌లిసి చిన్న సినిమా నిర్మాత‌ల్ని చంపేస్తున్నార‌ని, దీంతో కేసీఆర్ గారు చాలా డైన‌మిక్ లీడ‌ర్ అని, ఎంతో మంది చంపేసిన గ్యాంగ్‌స్ట‌ర్ నయీం లాంటి వారిని షూట్ చేసి పారేశార‌ని, ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న మాఫీయా బ్యాచ్‌ని కూడా షూట్ చేయాల‌ని వ‌ల్ల‌భ‌నేని అశోక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో టాలీవుడ్‌లో మ‌రోసారి ధియేట‌ర్ల మాఫీయా మ‌రోసారి సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. అయితే మరోపక్క ఎప్పటినుండో థియేటర్ల లీజుకు తీసుకునే సంస్కృతి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సంగతి అందరికీ తెలిసినదే..ఈ క్రమంలో కేవలం అనువాద చిత్రాలకు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసి చిన్న నిర్మాతలు ఇంత గోల పెట్టడం తగదు అని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

 

Comments

comments

Leave a Reply

*