అర్థరాత్రి రోడ్లపై తిరుగుతున్న టాలీవుడ్ స్వీట్ కపుల్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఒకరైన అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఇటీవల తమ వివాహ జీవితాన్ని ఎంతగానో సంతోషంగా గడుపుతున్నారు. గతంలో పెళ్లైన తర్వాత వెంటనే షూటింగ్ లలో పాల్గొన్న ఈ జంట తాజాగా తన పెళ్లి జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో పెళ్లి తర్వాత ఒప్పుకున్న సినిమాలను చేయడంలో నిమగ్నమైన ఈ జంట తాజాగా వీరిద్ద‌రు క‌లిసి మ‌జిలి సినిమా చేస్తున్నారు.నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కాస్తా బ్రేక్ ఇచ్చి మ‌రి విదేశాలలో వెకేషన్ చెక్కేశారు ఈ జంట‌. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ నగరంలో ఫుల్‌టా ఎంజాయ్ చేస్తోన్న ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది స‌మంత‌. అర్థ‌రాత్రి భార్య‌తో క‌లిసి రోడ్లు ప‌ట్టుకుని తిరుగుతున్నాడు నాగ‌చైత‌న్య‌. అసలే అక్క‌డ క్లైమేట్ చాలా త‌క్కువుగా ఉంటోంది. రొమాంటిక్ కపుల్ చిల్ అవుట్ అయ్యేందుకు సూటబుల్ గా ఉండే చిల్లింగ్ క్లైమేట్‌ను ఎంపిక చేసుకున్నార‌ట ఈ జంట‌. వీరిద్ద‌రు. వారం రోజుల పాటు అక్క‌డే ఉండి , త‌రువాత త‌మ సినిమాల‌తో బిజీ కానున్నారు.

Comments

comments

Leave a Reply

*