వైసీపీ పార్టీ లోకి వస్తున్న పవన్ కళ్యాణ్ మిత్రుడు..?

తెలుగు సినిమా రంగంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత దగ్గరగా ఉండే ప్రముఖ వ్యక్తులలో ఒకరు కమెడియన్ ఆలీ. ఈ క్రమంలో తాజాగా ఇటీవల ఆలీ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ కలిశారు. అయితే ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఆ సందర్భంలో చాలా కామెంట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఆలీ వైసీపీ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఏపీ మీడియా రంగంలో తెగ కథనాలు వినబడుతున్నాయి. హాస్య నటుడుగా అనేక చిత్రాలలో నటించిన ఆలీ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ నెల తొమ్మిదిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో ఆయన పార్టీ అదినేత జగన్ సమక్షంలో చేరవచ్చని ఆ కధనం చెబుతోంది.ఇప్పటికే జగన్ తో ఆలీ సంప్రదింపులు చేశారని కూడా సమాచారం. జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈనెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభలో అలీ పాల్గొని పార్టీలో చేరచ్చని ప్రచారం. ఆలీ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా పేరొందారు. ఆయన వైసిపిలో చేరితో విశేష వార్తే అవుతుంది.

Comments

comments

Leave a Reply

*