జగన్ కేసులో ఊహించని నిర్ణయం తీసుకున్న హైకోర్టు..!

గత అక్టోబర్ నెలలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు విషయమై తాజాగా ఇటీవల ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ( ఎన్ ఐ ఎ )కి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు.న్యాయం సాదించడంతో తమ పార్టీ విజయం సాదించిందని ఆయన అన్నారు. విమానాశ్రయాలలో ఇలాంటి ఘటనలు జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టవలసి ఉందని చట్టం చెబుతోందని, దానిని పక్కదారిన పట్టిస్తూ రాస్ట్రం సొంతంగా విచారణ చేపట్టిందని ఆయన అన్నారు. తమ వాదనలో సత్యం ఉండబట్టే కోర్టు తమ డిమాండ ను అంగీకరించిందని సుధాకరరెడ్డి అన్నారు.మంగళగిరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిసన్ వేశారు.కాగా దీనిపై సుప్రింకోర్టుకు అప్పీల్ కు వెళతామని ఎపి ప్రభుత్వం చెప్పింది.

 

Comments

comments

Leave a Reply

*