చంద్రబాబుకి కాకినాడలో షాకిచ్చిన బిజెపి పార్టీ..!

గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీపై మరియు నరేంద్ర మోడీ పై తెలుగుదేశం పార్టీ నేతలు దారుణమైన కామెంట్స్ చేస్తున్న క్రమంలో తాజాగా చంద్రబాబు కాకినాడ పర్యటనలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఏపీ బీజేపీ నేతలు. ముఖ్యంగా ఇటీవల ఏపీ రాష్ట్రంలో నరేంద్ర మోడీ పర్యటిస్తారు అని ప్రకటన చేసిన సందర్భంలో తెలుగుదేశం చేసిన కామెంట్లపై కౌంటర్లు ఇస్తూ ఏపీ బీజేపీ నేతలు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పర్యటనలను అడ్డుకునే యత్నం చేయడం ఆరంభించారు. కాకినాడలో చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ కొందరు తమ పార్టీ పతాకాలను చేబూని సి.ఎమ్.గోబ్యాక్ అని నినాదాలు చేశారు.వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పార్టీ అద్యక్షుడు మాలకొండయ్యను ముందుగానే గృహ నిర్భందం చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిదులను వాడుకుంటూ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని,దీనిపై తాము సి.ఎమ్.ను కలవడానికి అనుమతి ఇవ్వాలని పోలీసు అదికారులను బిజెపి నేతలు కోరారు. దానికి పోలీసులు అనుమతించలేదు.దాంతో వారు ఇలా న ఇరసన తెలిపారు. ఇలాంటివి చేస్తే చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించడం విశేషం.

 

Comments

comments

Leave a Reply

*