సంచలన కామెంట్ పూరి- రామ్ సినిమా..!

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ త్వరలో ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. గతంలో వరుస హిట్లతో అనేక మంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రస్తుతం ఆయనకు వరుస పెట్టి ఫ్లాపులు వస్తున్న క్రమంలో పూరితో సినిమా అంటే చాలామంది భయపడుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా ఎనర్జిటిక్ హీరో రామ్ తో సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా గత కొంత కాలం నుండి పెట్టలేక సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో రామ్ కూడా పూరి తో సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. పూరి ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి లో ప్రారంభించి మే నెలలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకునున్నాడు. పూరి భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నటి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబందించిన పూర్తీ వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం వీరిద్దరూ సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ సినిమా హిట్ పడింది అంటే ఇంకా పూరి జగన్నాథ్ మరియు రామ్ కెరియర్ చూసుకో అక్కర్లేదని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతారని చాలామంది సినిమా విశ్లేషకులు అంటున్నారు.

Comments

comments

Leave a Reply

*