బిగ్ బ్రేకింగ్: పొలిటికల్ జర్నీకోసం సంచలన నిర్ణయం తీసుకున్న రజినీకాంత్..!

ఒకపక్క వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రజిని..మరోపక్క తమిళ రాజకీయాల కోసం తన పార్టీ కోసం మరియు ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లాలని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రజనీకాంత్ మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ఒక ఛానల్ కూడా ప్రారంభించబోతున్నట్టు తమిళ్ పాలిటిక్స్ లో వార్తలు వినపడుతున్నాయి. ఈ మేరకు “మక్కల్ మంద్రం” అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన రజిని త్వరలో తన రాజకీయాలకి అనుబంధంగా ఒక టీవీ ఛానల్ ని కూడా స్థాపించబోతున్నారని సమాచారం. రాబోవు ఎన్నికలలో తాను పోటీ చేయడంతో పాటు, అన్ని స్థానాల్లో కూడా తన పార్టీ అభ్యర్థులను నిలబెడతానని రజిని ప్రకటించారు కూడా. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజిని త్వరలోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే రజనీకాంత్‌ పేరు మీద ఓ టీవీ చానెల్‌ను కూడా ప్రారంభించబోతున్నారనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రజనీ టీవీ పేరుతో ఓ ట్రేడ్‌ మార్క్‌ను కూడా రిజిస్టర్‌ చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మరోపక్క అధికారికంగా ఈ వార్త ఎక్కడా కూడా బయటకు రాలేదు.

Comments

comments

Leave a Reply

*