పవన్ కళ్యాణ్ కోరికను నెరవేర్చిన రామ్ చరణ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుఫానులు తీవ్ర అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఇటీవల వచ్చిన పేథాయి కోస్తా ఆంధ్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగా..మొన్న వచ్చిన తితిలి తుఫాను శ్రీకాకుళం జిల్లా ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తీవ్రంగా నష్టపరిచింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి జనసేన పార్టీ తరఫున అనేక సహాయ సహకార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తుఫాను తో అనేక సమస్యలు ఎదుర్కొన్నా శ్రీకాకుళం ప్రజలకు ఆ సమయంలో బాధ్యత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో దెబ్బతిన్న గ్రామాలను తన కుటుంబం తరఫున తన అన్న కొడుకు చరణ్ ని దత్తత తీసుకోమని తెలియజేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల తాజాగా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు శ్రీకాకుళం జిల్లాలో ఊరిని దత్తత తీసుకుంటున్నారని అప్పట్లో మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ క్రమంలో తాను చెప్పినట్లు గానే శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంకు చెందిన సుంకర జగన్నాధపురం అనే గ్రామాన్ని రామ్ చరణ్ దత్తత తీసుకోబోతున్నారు అంటూ వార్తలొస్తున్నాయి.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది.

 

Comments

comments

Leave a Reply

*