సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కేటీఆర్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో..!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూ సినిమాలపైనే దృష్టి పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక కామెంట్లు వినపడ్డాయి. అయితే తెలంగాణ రాష్ట్రం లో వచ్చిన ఎన్నికల ఫలితాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరైన రీతిలో నే నిర్ణయం తీసుకున్నారని ఈ సమయంలో ఎన్టీఆర్ తన సినిమాలపైనే దృష్టి పెట్టడం తన కెరియర్ కి ప్లస్ అని చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందుమూలంగా నే తన సోదరి నందమూరి సుహాసిని ఎన్నికల ప్రచారానికి కూడా జూనియర్ ఎన్టీఆర్..వెళ్లకుండా కేవలం తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లోనే బిజీ అయిపోయాడు. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలసి తారక్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ కలసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కలయిక ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

Comments

comments

Leave a Reply

*